ఘనంగా సరస్వతి మహా క్షేత్రం వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సరస్వతి మహా క్షేత్రం వార్షికోత్సవ వేడుకలు

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 18, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇల్చిపూర్ 1వ వార్డు శివారులో గల శ్రీ సరస్వతి మహా క్షేత్రం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్మాత పార్శి విఠల్ పటేల్ ఆధ్వర్యంలో వేద పండితులు గత రెండు రోజులుగా సామూహిక కుంకుమార్చనలు, అక్షరాభ్యాసం, ఒడి బియ్యాలు, హోమాలు, యజ్ఞాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించి తరించారు. ఈ కార్యక్రమంలో గంగవరం ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now