ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 19 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా, శివ్వంపేట మండల కేంద్రంలో వీధి దీపాలు రాత్రి, పగలు అనక నిరంతరం వెలుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఇలా నిరంతరం వెలుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు, వీధి దీపాలు నిరంతరం వెలగడం వల్ల విద్యుత్ వృథా అవుతున్నది. అంతేకాకుండా, విధి దీపాల జీవితకాలం తగ్గుతుంది. కొన్ని చోట్ల వీధి దీపాలు అసలు లేవు. ఉన్నచోట్ల ఇలా రాత్రనక పగలనక వెలుగుతూనే ఉన్నాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, వీధి దీపాలకు ఆన్-ఆఫ్ బటన్‌లు ఏర్పాటు చేయాలని అలాగే వీధి దీపాలు లేని చోట్ల వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని శివ్వంపేట గ్రామస్తులు తెలిపారు