*పది నిమిషాల్లోనే ఓలా పుడ్ డెలివరీ!*
➤ అత్యంత వేగంగా వినియోగదారులకు ఆహార పదార్థాలను చేరవేసేందుకు డెలివరీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ క్యాబ్ సేవల ప్లాట్‌ఫామ్ ఓలా కీలక ప్రకటన చేసింది. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు సిద్ధమైనట్లు సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్ ప్రకటించారు. ఆహార పదార్థాల డెలివరీతోపాటు ఇతర సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామన్నారు. ఇందుకోసం ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వేదికను ఉపయోగించుకుంటామని తెలిపారు.