తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ సరే…కౌలు రైతుల పరిస్థితి ఏమిటి..?
బీ ఎస్ పి పార్టీ మండల అధ్యక్షులు తoబర్ల నర్సింహారావు
ప్రశ్న ఆయుధం 21జులై
జూలూరుపాడు మండలంలో ఒక కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ సరే కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? అని ఆయన అన్నారు రాష్ట్రవ్యాప్తంగా కొందరు వ్యవసాయ కూలికి వెళ్ళటం ఇష్టం లేక అత్యధిక భూములున్న భూస్వాములు వద్ద భూములు కౌలుకు తీసుకొని వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటారు కౌలు రైతులు
అలాంటి కౌలు రైతులను ఆదుకొని వెంటనే కౌలు రైతు భరోసా పథకం కింద కౌలు చేసేటటువంటి రైతులకు ఎకరంకు పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని
వారన్నారు ఇప్పటికైనా కౌలు రైతులపై దృష్టి ఉంచి రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను గుర్తించి వారు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు
కౌలు రైతులు అంటేనే బిసి ఎస్సి, ఎస్టీ మైనార్టీ వారు అలాంటి బహుజన కుటుంబాలను నిర్లక్ష్యం చేయటం ప్రభుత్వానికి మంచిది కాదు అని ఆయన అన్నారు కౌలు రైతులు అత్యధిక వడ్డీలకు డబ్బును తీసుకువచ్చి కొందరు భూస్వాముల వద్ద భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ అత్యధిక నష్టాలు వాటిల్లుతున్న ఈ సంవత్సరం అప్పులు తీరతాయి అంటూ వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కౌలు రైతులు అలాంటి కౌలు రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి కౌలు రైతు భరోసా కింద ఎకరానికి 10000 చొప్పున ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలని ఆయన అన్నారు