హలో గౌడ .. ఛలో రవీంద్ర భారతి

హలో గౌడ ..చలో రవీంద్ర భారతి

జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాంగోళ్ల మురళి గౌడ్

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 10, కామారెడ్డి :

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఆదివారం జరిగే సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374 జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున గౌడ సోదరులు తరలిరావాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాంగోళ్ల మురళి గౌడ్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కోటను ఏలిన మహావీరుడని ఆయన సేవలను కొనియాడారు. గత 17 సంవత్సరాలుగా జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. జై గౌడ ఉద్యమం పోరాట ఫలితంగానే పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. గౌడ సోదరులందరూ భారీ ఎత్తున పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now