మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13న జరిగే మండల కేంద్రంలో ధర్నా.

21న జరుగు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.

సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి కార్మికులకు పిలుపు.

సిద్దిపేట అర్బన్:- మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13న మండల కేంద్రంలో ధర్నాలు 21న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శనివారం రోజున సిఐటియు జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. బాలమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాముని గోపాల్ స్వామి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాలలో వంటలు చేస్తున్న వారికి ప్రభుత్వం జీతాలు సరిగా ఇవ్వడం లేదని కేవలం వెయ్యి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2000 తో కలిపి మొత్తం మూడు వేల రూపాయలు చేసినప్పటికీ రెగ్యులర్గా వేతనాలు రావడం లేదని వారు అన్నారు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని అలాగే కూరగాయలు గుడ్లు రేట్లు పెరిగిపోయిన వాటికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు పెంచి ఇవ్వాలని అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10000 రూపాయలకు పెంచాలని అందులో రాష్ట్ర వాటా 25% ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రాంతంలో హరే రామ హరే కృష్ణ అనే స్వచ్చంద సంస్థకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించడం సరికాదని వెంటనే ఈ ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాలని లేకపోతే కార్మికులను ఏకజేసే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అవసరమైతే సమ్మె కూడా వెళ్తామని సందర్భంగా వారు హెచ్చరించారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ బాలలక్ష్మి నాయకులు ప్రమీల, సంతోష, స్వప్న, రాజేశ్వరి, శశిరేఖ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now