దేవాలయంలో బదిలీలు లేనట్టేనా !

పదేళ్లు గడుస్తున్న నేటికీ బదిలీ కానీ ఉద్యోగులు

పై స్థాయి అధికారులతో మంతనాలు వల్ల బదిలీలు లేనట్టా ?

అమ్మవారి సన్నిధానంలో అంత ఆసారు వారైనా !

నేటికీ లెక్కల్లోకి రాని అనేక వసూళ్లు ?

జిల్లాస్థాయి దేవదాయ శాఖ స్పందించాలంటూ ప్రజలు విజ్ఞప్తి

తెలంగాణలోని ఏ ప్రభుత్వ శాఖ అయిన ఉద్యోగ బదిలీలు మూడు సంవత్సరాల కాలం ముగియటంతో సాధారణ బదిలీలు కొనసాగిస్తారు. దీనికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు లేకుండా స్థానికంగా ఉండటమే కాకుండా అనేక పరిచయాలు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటారని అంకిత భావంతోనే ప్రభుత్వం బదిలీలు కార్యక్రమాలను కొనసాగిస్తుంది. ఇటువంటి బదిలీలు రకరకాల సందర్భాలను బట్టి కొనసాగిస్తారు. కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒకే ప్రదేశంలో 10 సంవత్సరాల వరకు బదిలీలు కాకుండా స్థానికంగా ఉండేందుకు అనేక అక్రమ మార్గాలను సృష్టించుకుని పై స్థాయి అధికారులతో మమికమై బదిలీలు కాకుండా ఉండేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. కొందరు రాజకీయ ప్రజాప్రతినిధులతో సత్య సంబంధాలను ఏర్పాటు చేసుకొని బదిలీలు కాకుండా ఉండేందుకు విష ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. అలాగే మరికొందరు ఉన్నత స్థాయి అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు చెల్లించుకుంటూ బదిలీ కాకుండా ఉండేందుకు వక్రమార్గాలను ఎంచుకుంటారు. అశ్వరావుపేట మండల పరిధిలోని వినాయకపురం గ్రామ పరిది లొని శ్రీశ్రీశ్రీ చిలకల గండ ముత్యాలమ్మ ఆలయంలోని కొందరు గత పది సంవత్సరాల నుండి వివిధ రకాల ఉద్యోగులను కొనసాగుతూ బదిలీ కాకుండా ఉండటం తో మండలంలో పెద్ద చర్చిని అంశంగా మారింది. దేవాదాయ శాఖ అయిన బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని అన్వేని కారణాలవల్ల బదిలీలు కాకపోవటం జరిగిందని కొందరు కొట్టి పారేస్తున్న మరికొందరు మాత్రం పై స్థాయి అధికారులకు భారీగా ముడుపులు చెల్లించడంతో ఒకే వ్యక్తి పది సంవత్సరాలు గా విధులు నిర్వహించడం గ్రామాల్లో చర్చిని అంశంగా మారింది. నిజానికి తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం అనేక బదిలీలు కొనసాగించినప్పటికీ కొందరు వేరే ప్రదేశానికి బదిలీలు అవకాశం ఉన్నప్పటికీ వెళ్లకుండా ఉండేందుకు వక్రమార్గాలను ఎంచుకున్నారని అందువల్లనే బదిలీలు ఉన్న వేరే ప్రదేశానికి వెళ్లలేదని మండలంలో గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వం పరమైన ఏ ఉద్యోగులైన మూడు సంవత్సరాల కాల పరిమితిలోనే ఒక ప్రదేశాల నుంచి మరో ప్రదేశానికి బదిలీ కావడం జరుగుతుంది. ప్రభుత్వపరమైన కొన్ని సందర్భాల వల్ల ఆ బదిలీలు ఐదేళ్లకోసారి లేక ఆరు సంవత్సరాల కోసం బదిలీలు జరగటం సర్వసాధరాణం బదిలీ అన్న మాట సర్వసాధనమైనప్పటికీ కొందరు బదిలీలు కాకుండా ఉండేందుకే జిల్లా స్థాయి అధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ఒక వ్యక్తి పది సంవత్సరాలు ఒకే ప్రదేశంలో ఉద్యోగంలో విధివిధానాలు కొనసాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఆలయ అధికారుల బదిలీలను కొనసాగించి విధంగా చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుకుంటున్నారు.ఇట్టి విషయంపై ఆలయ ఈవో సూర్య ప్రకాష్ రావుని చరవాణి ద్వారా వివరణ కోసం ప్రయత్నం చేయగా స్పందన కరువైంది.

Join WhatsApp

Join Now