ఘనంగా మల్లన్న ఉత్సవాలు
ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 22, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో మల్లన్న ఉత్సవాలు ఆదివారం రెండవ రోజులో భాగంగా మల్లన్న దేవునికి పూజలు చేసిన అనంతరం గ్రామంలోని ఊరడమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దపురం మల్లయ్య, బీరప్ప స్వామి, ఎల్లమ్మ, బంగారు మైసమ్మ, పోతు లింగయ్య, కట్ట మైసమ్మ, గంగమ్మ, బుసత్తవ్వ, శివాలయం, హనుమాన్ మందిరాలలో కొబ్బరికాయలు కొట్టి మల్లన్న ఉత్సవాలు సవ్యంగా సాగాలని, ఊరంతా సుఖ శాంతులతో ఉండాలని గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు వేడుకున్నారు. పురోహితులు పత్తిరి చెట్టుకు పూజ చేసి అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి విడిసి అధ్యక్షుడు గుడేళ్లి గంగారాం, ఉపాధ్యక్షుడు వంగ రాహుల్ కుమార్, నిట్టూ లింగారావు, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, కోశాధికారి నాగల్ల స్వామి, సభ్యులు మీసాల నవీన్, శ్రీను, బోడొల్ల రాజేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.