ఆలస్యమే అతని ప్రాణాలు కాపాడింది..!!!

IMG 20240810 WA0059

ఒక్కొక్కసారి ఆలస్యం కూడ మన మంచికే అనిపి స్తుంది, కొన్ని సందర్భాల్లో గుర్తుకొస్తుంది,అలాంటి ఘటనే చోటుచేసుకుంది, బ్రెజిల్ విమానా శ్రయంలో విమాన టికెట్ బుకింగ్ విష యంలో ఏర్పడిన కన్ఫ్యూ జన్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. చివరి క్షణంలో పొరపాటు గుర్తించి విమా నం ఎక్కేం దుకు వెళ్లిన అతడిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారితో గొడవ పెట్టు కుని నానా తిట్లు తిట్టిన వ్యక్తే కాసేపటి తర్వాత తన ప్రాణం కాపాడిన దేవుడి వంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బ్రెజిల్ లో జరిగిన ఈ ఘటన వివరాలు.. శుక్రవారం రాత్రి బ్రెజిల్ లో ఓ విమానం కూలిపోయి అందులోని మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ ప్రయాణికుడు చిన్న పొరపాటు కారణంగా ఆ విమానం ఎక్కలేక పోయాడు. రియో డిజెనీరో ప్రాంతానికి చెందిన అడ్రియానో అసిస్ శుక్రవారం కాస్కావెల్ నుంచి గ్వారుల్‌హోస్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకు న్నాడు.టైముకు ఎయిర్ పోర్టుకు కూడా చేరుకు న్నాడు. అయితే, తాను బుక్ చేసుకున్న టికెట్ ‘లాటమ్ ఎయిర్ లైన్స్’ కంపెనీదని భావించి ఆ ఫ్లైట్ కోసం లాంజ్ లో వేచి ఉన్నాడు. కాసేపటి తర్వాత టికెట్ చూసుకోగా అది ‘వోపాస్‌ ఎయిర్‌లైన్స్‌’ టికెట్.. అటు చూస్తే వోపాస్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరేం దుకు సిద్ధంగా ఉంది. దీంతో అసిస్ హడావుడిగా బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకు న్నాడు. కానీ అప్పటికే బోర్డింగ్ క్లోజ్ చేశామంటూ అక్కడున్న సిబ్బంది అసిస్ ను విమానంలోకి ఎక్కని వ్వలేదు. దీనిపై అసిస్ వారితో తీవ్రంగా గొడవ పెట్టుకున్నాడు. తర్వాత వోపాస్‌ ఎయిర్‌ లైన్స్‌ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విమానాశ్రయం మొత్తం వెతికి తనను అడ్డుకున్న ఉద్యోగిని కలిశానని, అతడిని కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పానని అసిస్ వివరించాడు…

Join WhatsApp

Join Now