మాదిగ ఉద్యోగస్తులు కదిలి రావాలి

*మాదిగ ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా విజయోత్సవ ర్యాలీకి కదలి రావాలి*

*చేర్యాల*

భారత దేశంలో డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎస్సీ లకు రాజ్యాంగం ద్వారా సాధించి పెట్టిన రిజర్వేషన్లు దేశంలో దాదాపుగా 1200 ఎస్సీ కులాలు ఉన్నప్పటికిని ఒక్కో రాష్ట్రంలో కేవలం ఒకటి లేదా రెండు కులాలు మాత్రమే అందిపుచుకొంటున్నాయి, కావున ఎస్సీ ల్లో ఉన్న ప్రతీ కులానికి వారి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను పంచాలని గత 30 సం.లుగా ఎమ్మార్పీఎస్ నేతృత్వంలో మొక్కవోని దీక్షతో పోరాటాలు చేసి,తమ చిరకాల ఆకాంక్ష అయినా ఎస్సీ వర్గీకరణ ను సాధించుకొని వస్తున్న ఎమ్మార్పీఎస్ అధినేత,మహాజన సూర్యులు, మందకృష్ణమాదిగ కి 13వ తేదీన హైదరాబాద్ మహానగరంలో లక్షలాదిగా మాదిగ, మాదిగ ఉపకుల ఉద్యోగుల కుటుంబ సమేతంగా,మరియు స్వంత గ్రామం నుండి, పని చేసే గ్రామం నుండి వందలాదిగా మాదిగ, మాదిగ ఉపకుల ప్రజలను తరలించాలని ఎం ఈ ఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ సంతోష్ మాదిగ, చేర్యాల మండల అధ్యక్షులు చదరపల్లి నరేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి కర్రోళ్ల విజయ్ కుమార్ మాదిగ, ఎం జె ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కర్రోల్ల నవజీవన్ మాదిగ, పేర్క రాజయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now