
తెలంగాణలో స్థానిక పోరుకు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జోరందుకుంది. పంచాయతీ ఎన్నికలలో అత్యం కీలకమైన వార్డుల విభజనపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు సంబంధించి జిల్లా ప్రాజెక్టు మేనేజరు, కంప్యూటర్ ఆపరేటర్లకు హైదరాబాద్‌లో శిక్షణ కూడా నిర్వహించారు.శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లతో జిల్లాలోని ఎంపీడీవో, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం (ఆగస్టు 8) ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఇక ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా వార్డుల విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల ఓటరు జాబితాను అందించాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికల సంఘం నుంచి నియోజకవర్గం, మండలాలు, గ్రామాల వారీగా ఓటరు జాబితా రాగానే వార్డుల వారీగా విభజన చేపట్టనుంది.వార్డుల విభజనకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాల పై మాస్టర్ ట్రైనర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఒకే కుటుంబం అంతా ఒకే వార్డు పరిధిలో ఉండేలా విభజన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఒక కుటుంబంలో ఓటర్లు రెండు, మూడు వార్డుల్లో ఉండడం, కొన్ని చోట్ల ఇతర గ్రామాల్లోనూ ఓటరుగా నమోదు అయి ఉండ డం లాంటివి గుర్తించిన నేపథ్యంలో ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను అంతా ఒక వార్డు పరిధిలోకే వచ్చేలా విభజన చేయనున్నారు. ఈ క్రమంలో గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకొని జాబితా తయారు చేయా లని సర్కార్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.ఓటరు లిస్ట్‌లో కుటుంబ సభ్యులం తా ఒకే వరుస క్రమంలో ఉం డేలా చూసుకో వాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఇందు కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా వార్డుల విభజన చేయనున్నారు. వార్డుల విభజనకు ప్రభుత్వం ఎలాంటి గడువు విధించలేదు.గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పం చి ఎన్నికలను మూడు విడతలుగా ప్రభుత్వం నిర్వహిం చనుంది. ఒకే సారి ఎన్నికలు నిర్వహిం చేందుకు సిబ్బంది సరిపడకపోవ డంతో మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తుంటారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు, 2564 వార్డులకు ఎన్నికలు జరుగు తాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది కేటాయింపుపై ఎన్నికల సంఘం గతంలోనే మార్గద ర్శకాలు జారీ చేసింది.వాటి ప్రకారం.. ఒక్కో వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల ప్రాతిపదికన పోలింగ్ కేంద్రాలకు ప్రిసై డింగ్ అధికారి, పోలింగ్ అధికారులను కేటాయించనున్నారు. 200 ఓట్ల లోపు ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి, 200-400 ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 650 పైన ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.650 ఓట్లు పైన ఉన్న గ్రామాల్లో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం గత ఏడాది డిసెంబరులో సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీకాలం పూర్తి అయ్యే లోపే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే గత ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, దీంతో సమయాభావం కారణంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరింత జాప్యం అనివార్యం అయ్యింది..
Post Views: 19