బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

IMG 20240810 WA0072

 

అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్ గారిని కలిశారు. గడిచిన 40 ఏండ్లుగా అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, పలు అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు, బోర్డులతో కలిసి పనిచేసిన డాక్టర్ రామ్ చరణ్ గారు ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యాచరణపై ఆసక్తి కనబర్చారు. బ్యాంక్ ఆఫ్అమెరికా (BoA),టయోటా(Toyota),నోవార్టిస్ (Novartis),జనరల్ ఎలక్ట్రిక్ (GE), UST గ్లోబల్, ఫాస్ట్ రిటైలింగ్ (Uniqlo), KLM ఎయిర్‌లైన్స్, మ్యాట్రిక్స్‌ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు డాక్టర్ రామ్ చరణ్ గారు కన్సల్టెంట్ గా పనిచేశారు. వేగంగా మారుతున్న పరిణామాల్లో వ్యాపార రంగానికి అవసరమైన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలను విశ్లేషిండంలో రామ్ చరణ్ గారు దిట్ట. డజన్లకొద్దీ గ్లోబల్ లీడర్లకు శిక్షణ ఇచ్చి, పలు కంపెనీలకు వ్యాపార సలహాదారుగా ఉంటూనే రామ్ చరణ్ గారు 30కిపైగా పుస్తకాలు రాశారు. రామ్ చరణ్ గారి అనుభవం తెలంగాణ పురోగతికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శించి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించి, అవి విజయవంతం అయ్యేందుకు అవసరమైన సూచనలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి డాక్టర్ రామ్ చరణ్ ని ఆహ్వానించారు..

Join WhatsApp

Join Now