*నల్లగొండ పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి*
*డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు పకడ్బందీగా ఆపరేషన్ చబుత్ర*
*-అర్థరాత్రి ఆవారా గా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్*
*-88 బైకులు,6 కార్లు, 15 ఆటోలు, 78 సెల్ఫోన్లు స్వాధీనం*
*-54 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదు*
*డీఎస్పీ కె శివరాం రెడ్డి*
ప్రశ్న ఆయుధం ,నల్లగొండ డిసెంబర్ 29:
శనివారం అర్థరాత్రి నల్గొండ పట్టణం లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సిఐలు 15 మంది ఎస్సైలు, 98 మంది కానిస్టేబుల్ మొత్తం 13 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్లగొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 154 మందిని అదుపులోకి తీసుకొని డిఎస్పీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుండి 88 బైకులు, 6 కార్లు, 15 ఆటో లు, 78 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన 54 మంది పై డీడీ కేస్ లు నమోదు చేయడం జరిగింది.
సిఐలు రాజశేఖర్ రెడ్డి, రాజు ఎస్ఐ లు నాగరాజు, సైదులు, సురేష్, సందీప్, శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.