ఐటిసి వారి ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, మెడికల్ క్యాంపు ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు మండలం
సారపాక
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఐటీసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించి రోగులకు మెడిసిన్స్ అందజేసిన పినపాక ఎం ఎల్ఏ యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు పరిశుభ్రతను పాటించాలని తద్వారా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచించారు,ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని అన్నారు ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, ఆరోగ్యం ప్రాముఖ్యతను తెవాతావరణం, పర్యావరణ కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు తదితర అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తెలియజేశారు అదేవిధంగా మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసిన ఐటీసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి ఐటీసీ అధికారులు, మెడికల్ సిబ్బంది
కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు