మాదిగ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి.

 

IMG 20240811 WA0042

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమం కోసం కేటాయించిన నిధులలో నుండి మాదిగ కార్పొరేషన్ కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ జన సంఖ్యను బట్టి మాదిగ కార్పొరేషన్ కు నిధులను కేటాయించాలి. మాదిగ కార్పొరేషన్ ద్వారా మాదిగ నిరుద్యోగులకు. చేతివృత్తుల వారికి . మాదిగలలో నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రతి సంవత్సరం రుణాలను అందించాలి. పేదరిక నిర్మూలనకు తోడ్పడాలి . రాష్ట్రంలోని మాదిగ గూడాలలో మౌలిక వసతులు అయినా రోడ్లు. విద్యుత్ . డ్రైనేజీ . విద్య వైద్య సౌకర్యాలను కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలోని 12 . 769 గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న మాదిగ పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతనాలను పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రతినెల మొదటి వారంలో క్రమం తప్పకుండా వేతనాలను అందే విధంగా నిధులు విడుదల చేయాలి. 1978 లో రాష్ట్రంలో మాదిగలకు ప్రభుత్వం పంచిన పంచరాయి మరియు పోరంబోకు భూములను సదును చేసుకోవడానికి గాను రైతులకు రుణాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనముల రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను. ఇట్లు దళిత రత్న . వడ్డూరి. కుమారస్వామి మాదిగ..

Join WhatsApp

Join Now