ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ విధానం రద్దు చేయాలి
కనిసవేతనం 18000/-రూ ఇవ్వాలి
సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలి
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల్ స్వామి
సిద్దిపేట ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం :
ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ను వెంటనే రద్దు చేయాలని వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాములు గోపాల్ స్వామి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలపై సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్ ఢ్ వేతనం రూ.18,000/-లు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని,ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు. హామీలు నేటికీ అమలు కావడం లేదని విమర్శించారు.ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని వేసిన కమిటీ ఆశాల సమస్యలు అన్ని అంశాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఆశా వర్కర్ల సమస్యలపైన నివేదికను అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వీటితోపాటు పెండింగ్ పిఆర్సి ఎరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ ఇచ్చే విధంగా చూస్తామని, సమ్మె కాలం వేతనాలు చెల్లిస్తామని, ఇతర పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తామని హామీనిచ్చారని, వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీనిచ్చిందని వాటినీ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. అప్పటి కమీషనర్ గారు స్పందిస్తూ రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు రూ.50 వేలు ఇస్తామని, రిజిస్టర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని పై అంశాల్లో ఒక్క సమ్మెకాలం వేతనాలు మాత్రమే ప్రభత్వం చెల్లించి.ఇతర సమస్యలు నేటికీ పరిష్కారం చేయలేదని మండిపడ్డారు. ఆశాలకు నష్టం కలిగించే ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి ఇప్పటివరకు అనేకసార్లు ఆరోగ్య శాఖామంత్రి, ఆరోగ్య శాఖ రాష్ట్ర అధికారులకు అనేక విజ్ఞప్తులు తెలియజేశామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆషాల సమస్యలు పరిష్కారం చేయకపోవడం దుర్మార్గం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని లెని ఎడల ఆందోళన,పోరాటాలు ఉదృతంగానిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రంలో సీ ఐ టి యు జిల్లా కోశాధికారి గొడ్డు బర్ల భాస్కర్, శ్రామిక మహిళ కన్వీనర్ ఏం. పద్మ, ఆశా వర్కర్లుయూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజుల,బి.ప్రవీణ, భాగ్యలక్ష్మి, మంజుల,బాలమణి, ,రజిత,శారద, వరలక్ష్మి,సంతోష,లక్ష్మీ, రమణ ,, స్వరూప,లత, వసుందర, శోభ, మణెమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.