మహిళా సమస్యలపై ఉద్యమిస్తాం.
జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింగిరెడ్డి నవీన, అత్తిలి శారద.
సిద్దిపేట ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం :
- రానున్న కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింగిరెడ్డి నవీన, అత్తిని శారదలు అన్నారు. ఆదివారం రోజున సిద్దిపేట లో అర్బన్ మండల ప్రధమ మహాసభ దండు లక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన ఆవిష్కరించారు అనంతరం జరిగిన మహాసభలో అధ్యక్ష కార్యదర్శులు సింగిరెడ్డి నవీన అత్తిని శారదలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా మహిళలకు అన్నిట్ల అన్యాయం జరుగుతుందని ఈరోజు మహిళలు పట్టపగలే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదని ఎక్కడ చూసినా అత్యాచారాలు అఘాట్యాలతో దేశం తడుపుతుందని వీటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైపల్యం చెందాయని వారన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలకు అన్నిట్లో 50% రిజర్వేషన్ ఉండాల్సింది పోయి ఈరోజు చట్టసభల్లో 33 శాతానికే పరిమితం చేసి అది కూడా పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో 2029 నుండి అమలు చేస్తామనడం సిగ్గుమాలినయ అని 50% చేయాల్సిన రిజర్వేషన్ 33 కుదించి మహిళలకు తీవ్రని అన్యాయం చేస్తున్నారన్నారు అలాగే అగత్యాలు అత్యాచారం అరికట్టే దానికోసం చట్టాలను పటిష్టం చేయాల్సింది పోయి అధికారంలో ఉన్నవాళ్లే మహిళలను కించపరిచే విధంగా చూడడం సబబు కాదని రాబోయే కాలంలో ఇలాంటి వివక్షతకు గురి చేస్తే ఊరుకునేది లేదని ఉద్యమిస్తామని హెచ్చరించారు కేంద్రంలో అధికారులకు వచ్చిన బిజెపి మహిళలకు పెద్దపీఠవేస్తామని భారత్ మాతాకు జై అంటూ నినదించేవాళ్లు ఈరోజు మహిళలను కించపరిచే పద్ధతిలో వివరిస్తున్నారని మంత్రులు సైతం ఇలాంటి సమస్యలు ఇలాంటి అగత్యాలకు పాల్పడుతున్నారని వారు అన్నారు ఇప్పటికైనా వాటిని అరికట్టాలని ఆరన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు మహిళలకు మహిళ మహాలక్ష్మి పేరుతోటి 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయట్లేదని అలాగే 28వ ఉచిత 200 యూనిట్లు ఉచిత కరెంటు అని చెప్పి ఎక్కడ అది అమరపాట్లేదని దాన్ని కూడా అందరికీ అద్దె ఏంటి వాళ్ళకి కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇల్లు ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు ఇండ్లు ఇవ్వాలని కొత్త రేషన్ కార్డులకు వెంటనే అవకాశం కల్పించాలని వృద్ధాప్య వికలాంగుల వితంతు పెన్షన్లు పెంచి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు దేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఐద్వా జిల్లా నాయకురాలు జాలిగపు శిరీష మాట్లాడారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఐద్వా మండల అధ్యక్షురాలు బెల్లి రాజమణి, కార్యదర్శిగా దండు లక్ష్మి ఉపాధ్యక్షులుగా మద్దెల లక్ష్మి, చెప్యాల బాలమణి, రేణుక, సహాయ కార్యదర్శులుగా బై రోజు హరిత, కొంచెం సుజాత, ఖాతాలక్ష్మి మండల కమిటీ సభ్యులుగా రాజేశ్వరి మంజుల కవిత స్వరూప లక్ష్మి ఉమామహేశ్వరి నరసవ్వ పద్మ గంగవ్వ సప్న లను ఎన్నుకోవడం జరిగింది.
మహిళా సమస్యలపై ఉద్యమిస్తాం
Published On: August 11, 2024 5:52 pm
