తెలంగాణకు సాంస్కృతిక వైభవం…

బోనాల పండుగలు తెలంగాణ కు సాంస్కృతిక వైభవం :

బింగి స్వామి కె ఆర్ పి ఎస్ అధ్యక్షులు

లస్కర్ నుండి పల్లెలదాకా

తెలంగాణ పల్లెల్లో బోనాలు
సాంస్కృతిక వైభవం నాటి నుంచి నేడు కొనసాగుతుంది

ప్రశ్న ఆయుధం 11ఆగష్టు
హైదరాబాద్ :
బోనాల పండుగలు తెలంగాణ కు సాంస్కృతిక వైభవం అని కురుమరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి అన్నారు. రసూల్ పూర్ లో నిర్వహించే బీరప్ప పోచమ్మ బోనాల పండుగకు కె ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసర్ జాంహంగిర్ తో కలిసి దర్శించుకున్నార. తెలంగాణలో హైదరాబాద్ గోల్కొండలో ప్రారంభమైన బోనాలు వారం వారం ఒక చోట నుండి ఒకచోటకు శ్రావణమాసంలో పల్లెలకు విస్తరించి కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని బోనాల పండుగ ప్రకృతి పండగని తెలంగాణకు సాంస్కృతిక వైభవం తీసుకొచ్చిన బోనం ప్రతి కుటుంబానికి శుభ సూచికగా నిలిచిందన్నారు. పిల్లాపాపలు కుటుంబ సభ్యులతో బాగుండాలని బీరప్ప స్వామిని అమ్మవారిని కోరుకున్నామని నిత్యం దైవచింతనలో ఉండేవారికి మానసిక ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు మన పండుగలు దోహదపడతాయన్నారు. గుడిలో ఉండే శక్తి మనల్ని ముందుకు తీసుకుపోతుందని దానికోసం మనందరం మన వారసత్వ సంపదగా రాబోయే తరాలకు ఈ సాంస్కృతిని అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రసూల్ పూర కురుమ సంఘం అధ్యక్షులు జంగిలి రాజు నాయకులు దయ్యాల యాదగిరి. ఎగుర్ల జయరాములు, ఒగ్గు శ్రీను తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now