మథర్ థెరిస్సా లెజెండరీ అవార్డు గ్రహీత ముద్దసాని

*మథర్ థెరిస్సా లెజెండరీ అవార్డు అందుకున్న యువ రచయిత ముద్దసాని శ్రీనివాస్*

*జమ్మికుంట /హుజురాబాద్/ వీణవంక ప్రశ్న ఆయుధం ఆగస్టు 11*

76వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ సేవా సంస్థ అయిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్మదినం స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్మారక దినాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో సేవలందించిన ప్రతిభావంతులకు లెజెండరీ అవార్డులు అందజేయడం జరిగింది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన ముద్దసాని శ్రీనివాస్ సాహిత్య రంగంలో కవితల ద్వారా పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి మధర్ థెరిస్సా లెజెండరీ అవార్డును తేదీ:10-8-2024 శనివారం రోజున హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖులు విశిష్ట అతిథులు BC కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ దైవాజ్ఞ శర్మ సినీ నిర్మాత సత్య వెంకట్ సినీనటి ఫైజా జాన్ ఫౌండర్ డా. ఎస్ సరోజనమ్మల చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేశారు.ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు గాను అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ డా.ఎస్ సరోజనమ్మకు ముద్దసాని శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గణేష్ కళాబృందం అధ్యక్షుడు గోనెల పెద్దులు మల్లారెడ్డిపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ మాజీ 4 వ వార్డు సభ్యులు బండారి రజిత రవి పటేల్ గంధం సుమన్ పూదరి రాజేష్ గోనెల ప్రవళిక సిరివెన్నెలలు పాల్గొని అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now