సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 11 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అన్నారు. మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన గంగాల శైలజకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన 48 వేల రూపాయల చెక్కును మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త శనివారం బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈసందర్బంగా తాజా మాజీ జడ్పీటీసీ మహేష్ గుప్త మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడే బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆర్థికంగా కొంత ఊరటనిస్తాయని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో బసంపల్లి పోచ గౌడ్ వంజరి కొండల్, ఒర్రె శ్రీనివాస్,యాదవ్ దొడ్ల అశోక్, దేవేందర్ గౌడ్,కోవూరి వెంకటేష్, ,ఖదీర్,ముద్దగల రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now