మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి తప్పకుండ అందజేస్తామని పీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,జిల్లా గ్రంధాలయ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు.ఆదివారం సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త,పీఎసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డితో కలిసి మండలంలోని పలు గ్రామాలలోని లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మంజూరు అయిన 19 లక్షల సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఇంటింటికి తిరిగి అందజేశారు.ఈ సందర్బంగా సుహాసిని రెడ్డి,రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు.సంక్రాంతి పండగ తర్వాత మరిన్ని హామీలు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని,ప్రజల ముఖాలలో ఆనందాన్ని చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 440 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తే ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం సుమారు 840 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిందన్నారు అన్నారు.అంతకు ముందు శివ్వంపేటలో రాజిరెడ్డి,సుహాసిని రెడ్డి,ఆంజనేయులు గౌడ్,కి నవీన్ గుప్త తన అనుచరులతో ఘనంగా స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఉమాలక్ష్మీకాంతారావు,వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,వారాల గణేష్,వంజరి గౌరీశంకర్,బానూరి నారగౌడ్,గడ్డమీది కృష్ణగౌడ్,చింతల లక్ష్మారెడ్డి,గడ్డం రాజు, భవన్నగారి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now