దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు….

శ్రీకృష్ణ జువెలరీ షాప్ లో దొంగతనాన్ని ఛేదించిన శామీర్ పేట్ పోలీసులు.

ప్రశ్న ఆయుధం 12ఆగష్టు :
శామీర్ పేట్ :- మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీసులు 6వ తారీకున మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ జువెలర్స్ లో జరిగిన దొంగతనాన్ని చేదించిన శామీర్ పేట్ పోలీసులు అనంతరం మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు దొంగతనానికి పాల్పడిన వారు నలుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. నలుగురు సూర్య నగర్ లోని ఇంటిని అద్దెకు తీసుకొని జల్సాగా జీవించేందుకు అలవాటు పడి భారీ దొంగతనానికి పన్నాగం పని తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ లో దొంగతనం చేసేందుకు పక్క స్కెచ్ వేసుకొని గజ్వేల్ నుండి పల్సర్ ద్విచక్ర వాహనాన్ని దొంగలించి అదే వాహనాన్ని శ్రీకృష్ణ జ్యువెలర్స్ లో దొంగతనానికి వినియోగించారు ఎంతో చాకచక్యంగా పోలీసులు వ్యవహరించి 300 సిసి టీవీ ఫుటేజ్ లా ఆధారంగా సూర్య నగర్ లో అదుపులోకి తీసుకొని వారి నుండి 17 తులాల బంగారు ఆభరణాలు 48 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడిన దుండగుల పేర్లు ఏ1.హనుమాన్ సింగ్, ఏ2.శంకర్ సింగ్, పరారీలో ఉండగా 3.శంకర్ సింగ్ 4. అదుపులోకి తీసుకొన్ని కోర్టుకు రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డిసిపి మేడ్చల్ జోన్ నరసింహ క్రైమ్ బ్రాంచ్, పెట్బషీర్బాగ్ ఏసిపి రాములు, సిసిఎస్ ఏసిపి, షామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నరసింహారాజు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now