దేశభక్తి పెంపొందించేందుకే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
*జిల్లా ప్రజలు అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి*
*దేశం విడిపోయినప్పుడు జరిగిన విషాద గాథలు ప్రజలు తెలుసుకోవాలి*
*కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార*
ప్రశ్న ఆయుధం ,ఆగస్టు 12, కామారెడ్డి :
బిజేపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజెవైఎం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ కామారెడ్డిలో బీజేపీ జిల్లా కార్యాలయం నుండి సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, కమాన్, నిజాంసాగర్ రోడ్డుల మీదుగా కొత్త బస్ స్తాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్ స్టాండ్ వద్ద సాముహిక జనగణమన పాడి కార్యక్రమాన్ని ముగించారు. ఈ బైక్ ర్యాలీ ని కామారెడ్డి అసెంబ్లీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా దేశభక్తి పెంపొందించేందుకే హర్ ఘర్ తీరంగా కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారని అన్నారు. జిల్లా ప్రజలు అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 14 1947 రాత్రి దేశం విడిపోయినప్పుడు జరిగిన విషాద గాథలు ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.