కామారెడ్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు

కామారెడ్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు

ప్రశ్న ఆయుధం న్యూస్, జనవరి 19, కామారెడ్డి :

ప్రభుత్వ మెడికల్ కళాశాల కామారెడ్డి నందు ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహించుటకై నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నామని కామారెడ్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ వారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తుతో పాటు, అర్హత ధ్రువీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో 2025 జనవరి 21వ తేదీ ఉదయం 11 గంటల నుండి 2025 జనవరి 25 వ తేదీ 4 PM లోపు వారి ప్రస్తుత కార్యాలయం 5-8-102, శ్రీరామ్ నగర్ కాలనీ, కామారెడ్డి నందు సమర్పించాలని తెలిపారు. ఈ నోటిఫికేషన్ దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలకు 9704571133 నెంబర్ కి వాట్సాప్ లో సంప్రదించగలరని, కింద తెలిపిన సంబంధిత నోటిఫికేషన్ లింకు పూర్తి వివరాలు చూడగలరని తెలిపారు.
https://drive.google.com/file/d/1w2pqK_Au7f7fkVETTY7uZBoJTad_IDs1/view
ఈ ఉద్యోగ ప్రకటనలో సవరణలు లేదా రద్దు పరచుటకు చైర్మన్ కామారెడ్డి మ్యాన్ పవర్ సర్వీసెస్ కి పూర్తి అధికారం కలదని ఈ సందర్భంగా తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment