నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి జనవరి 19:
ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద కొబ్బరికాయలు, నవధాన్యాలు అమ్ముకొనుట, లడ్డు, పులిహోర అమ్ముకొనుటకు, సైకిల్ స్టాండ్ నిర్వాహణకై ఈ నెల 20వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దేవాలయ ప్రాంగణంలో బహిరంగ వేళము నిర్వహించుటకు నిర్ణయించనైనదని కార్యనిర్హణాధికారి గింజుపల్లి వేణు తెలిపారు. ఆసక్తి గల వ్యాపారస్తులు, భక్తులు డిపాజిట్ నగదు చెల్లించి వేలములో పాల్గొనాల్సిందిగా ఈ.ఓ కోరారు.