నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
ఏడపల్లి జనవరి 19:
ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గల విజయ దుర్గ వైన్స్ సంబంధించిన పర్మిట్ రూమ్ లో శుక్రవారం సాయంత్రం నిర్వాహకులు స్థానికులకు కుళ్ళిన మాంసాహార పదార్థాలు విక్రయించడంతో కుళ్లిన పదార్థం మార్చి ఇవ్వాలని కోరగా నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారు. బాధితుడు పాపాయి నాగేష్ శుక్రవారం రాత్రి అటు బోధన్ ఎక్సైజ్ శాఖ తో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు చరవాని ద్వారా సమాచారం అందించాడు. శనివారం ఉదయం జిల్లా ఇన్చార్జి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురాం పర్మిట్ రూం లో తనిఖీలు చేపట్టారు. 3500 రూపాయల విలువగల యాభై పగిలిన స్థితిలో ఉన్న కోడి గుడ్లను గుర్తించడం జరిగిందని, వాటిని ధ్వంసం చేయడం జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు అలాగే ఆహార పదార్థాలలో వినియోగించే రంగు డబ్బాలను గుర్తించి వాటిని స్వాదీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
పర్మిట్ రూం వంటగది లో పరిశుభ్రత పాటించాలని, నిర్వాహకులు సైతం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పలు రకాల ఆహార శాంపుల్స్ లను పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపడం జరిగిందని అన్నారు. అనంతరం బాధితుడు పాపాయి నాగేష్ మాట్లాడుతూ…నిన్న రాత్రి ఫుడ్ ఇన్స్పెక్టర్ కు పిర్యాదు చేస్తే, ఈ రోజు ఉదయం ఫుడ్ ఇన్స్పెక్టర్ తనికీ నిర్వహిస్తే, పర్మిట్ రూం నిర్వాహకులు నిన్న వున్నటువంటి కుళ్లిన మాంస పదార్థం అలాగే ఉంచుతారా అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే కుళ్లిన స్థితిలో ఉన్న మాంసం ఉన్న చోటే ఉదయం ఫ్రెష్ గా ఉన్న మాంసాన్ని ఉంచి అధికారిని తప్పుదోవ పట్టించారని బాధితుడు ఆరోపించాడు.
పర్మిట్ రూం నిర్వహణకు ఎలాంటి అనుమతి లేనప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చూడడం సరికాదని, సామాన్య ప్రజల జీవితాలతో నిర్వాహకులు ఆటలు ఆడుతుంటే అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానం కలుగుతుందని అన్నారు. పర్మిట్ రూం అనుమతి వచ్చే వరకు ఎలాంటి అమ్మకాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇట్టి విషయమై జిల్లా కలక్టర్ కు పిర్యాదు చేస్తామని బాధితుడు తెలిపాడు. నిర్వాహకులను ప్రశిస్తే వ్యక్తిగత అక్రమ కేసులు బనాఇస్తామని, సంబంధిత శాఖ అధికారులు తమ కనుసన్నల్లో పనిచేస్తారని, తమకు ఇష్టం వచ్చింది చేసుకోవాలని బాదితున్న నిర్వాహకులు బెదిరించడం కొసమెరుపు.