ప్రమాద బాధితుడిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే జారే

అశ్వరావుపేట నియోజవర్గ ప్రతినిధి (ప్రశ్న ఆయుధం న్యూస్)19

దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంవద్ద రహదారి మూలమలుపులో మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి గాయాలపాలైన మొద్దులగూడెం గ్రామానికి చెందిన తోకల శ్యామ్ ని అటుగా వెళ్తున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గమనించి తన వాహనంలో వారి వ్యక్తిగత గున్మెన్ ల సహాయంతో సమయానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా చూసారు. ప్రత్యేక శ్రద్ధ చూపించినందుకు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now