ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో అవకతవకలు

*గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా అన్హరులకు వచ్చిందని ఆందోళనకు దిగిన అర్హులు*

*కొన్ని గ్రామసభల్లో తమ పేర్లు లబ్ధిదారులుగా రాలేదని వాగ్వివాదానికి దిగిన మహిళలు*

*ప్రజా పాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ సర్ది చెప్పిన అధికారులు*

*ఇల్లందకుంట జనవరి 21 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలుపరచనున్న ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల జారీ నాలుగు పథకాలకు సంబంధించిన అర్హులను లబ్ధిదారులను గుర్తించడానికి మంగళవారం నుండి శుక్రవారం వరకు నిర్వహించనున్న గ్రామసభల్లో ప్రజలు పాల్గొవాలని పిలుపునిచ్చిన సంగతి విధితమే మంగళవారం రోజున మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసభలు గ్రామ స్పెషల్ ఆఫీసర్ మండల ప్రత్యేక అధికారి గ్రామపంచాయతీ కార్యదర్శి పాల్గొని ఇందిరమ్మ ఇండ్లలో మొదటగా గుర్తించబడిన లబ్ధిదారుల పేర్లను సభలో ప్రస్తావించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు అన్హరులకు లబ్ధిదారులుగా ఏ విధంగా గుర్తిస్తారు అని వాగ్వివాదానికి కొందరు దిగారు వెంటనే స్పందించిన గ్రామ ప్రత్యేక అధికారి వారికి నచ్చచెప్పి సరియైన లబ్ధిదారుని గుర్తించుటకే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కొన్ని గ్రామాలలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లలో పేరు రావలేదని గొడవ చేశారు దానిని గుర్తించిన అధికారులు కొత్త దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రజా పాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తాసిల్దార్ రాణి ఎంపీడీవో పుల్లయ్య ఏవో సూర్యనారాయణ ఎంపీ ఓ రాజేశ్వరరావు ఏ ఈ దివ్య గ్రామపంచాయతీ కార్యదర్శులు రెవిన్యూ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now