*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుపరచనున్న నాలుగు పథకాలు*
*ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు*
*కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్*
*ఇల్లందకుంట జనవరి 21 ప్రశ్న ఆయుధం*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుపరచనున్న నాలుగు పథకాలు రైతు భరోసా
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు ఈ పథకాల అమలకు విధి విధానాల గురించి నిజమైన అర్హులను గుర్తించడానికి వారి వారి గ్రామాలలో 21 మంగళ వారం నుండి24 శుక్ర వారం వరకు గ్రామపంచాయతీ ఆఫీస్ లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలను పంచాయతీ సెక్రెటరీ స్పెషల్ ఆఫీసర్లు అర్హులను గుర్తించడం జరుగుతుందని
ఈ నాలుగు పథకాలకు దరఖాస్తు పెట్టుకొని పేర్లు జాబితాలో లేనివారు ఎలాంటి ఆందోళన గురికాకుండా ఈ గ్రామ సభలో మళ్లీ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఈ అవకాశం సద్వినియం చేసుకొని బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలో నడవాలని ఇల్లందకుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు