బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజుకు బీజేవైఎం నాయకుల సన్మానం

*నూతనంగా ఎన్నికైన బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిని శాలువాతో ఘనంగా సత్కరించిన బి జె వై ఎమ్ నాయకులు*

*జమ్మికుంట జనవరి 21 ప్రశ్న ఆయుధం*

ఇటీవల నూతనంగా ఎన్నికైన బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజును బిజెవైఎం నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ బిజెపి పార్టీలో మొదటి నుంచి పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసే ప్రతి వ్యక్తిని పార్టీ గుర్తించి తగిన స్థానం కల్పిస్తుందని వారు తెలిపారు అదే కోవలో పనిచేసిన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి వార్డుకు చెందిన కొలకాని రాజు పార్టీ ఇచ్చిన ఏ పనినైనా ఎంతో శ్రద్ధతో నిర్వహించారని వారు అన్నారు జమ్మికుంట పట్టణ నూతన అధ్యక్షుడు కొలకాని రాజును బి జె వై ఎమ్ నాయకులు సిరియాల విజయ్ పటేల్ మిత్ర బృందం ఘనంగా శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేంద్ర పటేల్ మోతులగూడెం భూత అధ్యక్షుడు పొన్నగంటి రవికుమార్ పి జె ఆర్ జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి సురేందర్ రెడ్డి ఎఫ్ పి ఓ అధ్యక్షుడు సంద మహేందర్ పొన్నగంటి సతీష్ కుమార్ బోనగిరి ఉదయ్ నవీన్ కుమార్ గణేష్ రాజేష్ మధు సంకేత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now