ప్రజా పాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియ ఎవరు అధైర్యపడవద్దు మునిసిపల్ కమిషనర్ ముహమ్మద్ ఆయాజ్

*ప్రజా పాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ ప్రజలు అధైర్య పడవద్దు*
*వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్*

*జమ్మికుంట జనవరి 21 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు నిరంతర ప్రక్రియగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నిర్వహించే సభలకు హాజరై మాట్లాడుతూ 30వార్డులలో ఇందిరమ్మ ఆర్హత జాబితా ప్లాట్ ఉన్నవారు 2507 మంది అని ప్లాట్ లేని వారు 2421 మంది వచ్చినవని రేషన్ కార్డ్స్ 646 , సోమవారం రోజున 18 వార్డులలో కొత్త రేషన్ కార్డ్స్ 471 , సభ్యుల నమోదు 354 , ఇందిరమ్మ ఇండ్లు 488, మొత్తం 1313. దరఖాస్తులు వచ్చినవి అని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే వార్డు సభలో ప్రజలు హాజరై ఇందిరమ్మ ఇండ్లు కొత్తగా నమోదు, కొత్త రేషన్ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని, మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా వార్డు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ అయాజ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనజర్ జి రాజి రెడ్డి సూపర్ వైజర్స్ నరేష్ , శ్రీధర్ , ప్రదీప్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, వాణి , భాస్కర్ వార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now