పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

*పకడ్బందీగా లబ్దిదారుల ఎంపిక చేయాలి*
*అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలి*
*అర్హుల జాబీతాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తులు చే సుకోవాలి*
*మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక*

*హుజురాబాద్ జనవరి 21 ప్రశ్న ఆయుధం*

ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలుపరచనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు వార్డుల్లో నిర్వహిస్తున్న లబ్దిదారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు పకబ్బందీగా నిర్వహించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక అన్నారు. మంగళవారం ఈ మేరకు మున్సిపల్‌ పరిదిలోని పలు వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేయాలన్నారు. అర్హులైన ప్రతి లబ్దిదారునికి పథకాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే అన్నీ వార్డుల్లో చాలా మంది లబ్దిదారులు దరఖాస్తులు చేసుకొని ఉన్నారని, అయితే కొంత మంది పేర్లు మాత్రమే అర్హుల జాబీతాలో వచ్చాయని, అర్హులైన వారందరికి లబ్ది జరిగేలా ప్రభుత్వం న్యాయం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హుల జాబీతాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని, లబ్దిదారులు వార్డుసభలను సద్వినియోగం చేసుకొని అర్హుల జాబీతాల్లో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ సమ్మయ్య, కౌన్సిర్లు వార్డు అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now