నేతాజీ కి నివాళులర్పించిన గజ్వేల్ బీజేపీ నేతలు
గజ్వేల్ నియోజకవర్గం, 23 జనవరి 2025 :
భారత స్వాతంత్ర్య సమర వీరులలో అగ్రగణ్యుడు, అలుపెరుగని పోరాటం. ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చెసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (పరాక్రమ దివస్) సందర్భంగా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ పట్టణ, మండల అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బీజేపీ సీనియర్ నాయకులు, గజ్వేల్ పట్టణ మండల బిజెపి నాయకులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు యెల్లు రాం రెడ్డి, కుడిక్యాల రాములు, ఉప్పల మధుసూదన్, నత్తి శివకుమార్, చేప్యాల వెంకట్ రెడ్డి, దుబ్బకుంట నరేష్, సుమతి, పెండ్యాల శ్రీనివాస్, నాయిని సందీప్, కుంకుమ రాణి, మంతురి మమత, బార్ అరవింద్, శ్రీనివాస్, గణపతి, వేణు, శివ ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు