పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
ప్రతి గ్రామసభలో స్థానికుల సలహాలు సూచనలు తప్పక తీసుకోవాలి
లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత అధికారులదే
ప్రశ్నయుధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
వెంకటాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న గ్రామసభలో స్థానిక శాసనసభ్యులు – ప్రజా సేవకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
పాల్గొని అధికారులు నమోదు చేస్తున్న సమాచారాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా గ్రామస్తుల సలహాలు సూచనలు మేరకు నిజమైన అర్హులకు నష్టం లేకుండా ప్రభుత్వం అందించే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.