కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

*కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి*

*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు, జమ్మికుంట పట్టణ పరిధిలోని 86 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, తహసిల్దార్ రమేష్ బాబు ఎంపీడీవో భీమేష్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

.

Join WhatsApp

Join Now