గజ్వేల్ బంద్ విజయవంతం చేయాలి
దారం గురువారెడ్డి
గజ్వేల్ ఆగస్టు 12 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ బంద్ విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం గురువారెడ్డి అన్నారు. గజ్వేల్ బిజెపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బిజెపి సీనియర్ నాయకులు దారం గురవరెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి నిరసనగా, బంగ్లాదేశ్ లోని హిందువులకు మద్దతుగా గజ్వేల్ లో మంగళవారం నిర్వహిస్తున్న హిందూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు హైందవ సోదరులు, హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన గజ్వేల్ బంద్ విజయవంతం చేసి, హిందువుల ఐక్యత చాటాలని కోరారు. గజ్వేల్ లో నిర్వహిస్తున్న బంద్ కు బిజెపి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్, రోహిత్, నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.