విజయ దండోరా ను విజయవంతం చేయండి
మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి
సిద్దిపేట ఆగస్టు 12 ప్రశ్న ఆయుధం :
మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ అమలు కోసం ఢిల్లీకి వెళ్లిన మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ ఢిల్లీలో విజయ దందుక మోగించి సుప్రీంకోర్టులో ఆగస్టు 1న తీర్పు వెలువడిన సందర్భంగా రేపు తెలంగాణ గడ్డమీద అడుగుపెడుతున్న సందర్భంగా మాదిగ జర్నలిస్టులందరూ హైదరాబాదుకు తరలి వెళ్లాలని మాదిగ జర్నలిస్టు పోరం రాష్ట్ర కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి జర్నలిస్టులందరూ మాదిగ బంధువులందరూ మందకృష్ణకు స్వాగతం పలుకుతూ విజయ దండోర ను విజయవంతం చేయాలని కోరారు.