హైదరాబాద్ తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు
చేర్యాల ఆగస్టు 13 ప్రశ్న ఆయుధం :
చేర్యాల మండలంలోని ప్రతి గ్రామము నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు హైదరాబాదులో జరిగే విజయోత్సవ ర్యాలీ కి తరలి వెళ్లడం జరిగినది. ఈ సందర్భంగా అడ్వకేట్ భూమిగారి మనోహర్
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గడిపే బాలనర్సయ్య సిద్దిపేటజిల్లా నాయకులు మల్లిగారి యాదగిరి ఎం జె ఎఫ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కర్రోల్ల నవజీవన్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమ ఫలితం ఆవిష్కృతమైన వేల
మహా జననేత మందకృష్ణ మాదిగ తెలుగు గడ్డమీద అడుగుపెడుతున్న సందర్భంగా జననీరాజనంతో స్వాగతం పలికెందుకు
చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిన ఘట్టాన్ని తిలకించడానికి ప్రపంచానికి తెలియజేయడానికి కదిలి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సనావాల ప్రసాద్ బండ ఐలయ్య దర్శనం వెంకన్న బుద్ధుని శ్రీకాంత్ ముచ్చా ల నరసింహులు ముస్తాల రాజేష్ రామగళ్ళ జూకయ్య వివిధ గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.