ఎంతో మంది అమరుల త్యాగఫలితం నేటి స్వాతంత్ర భారతం
*ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుని వారి త్యాగాలు తెలుసుకోలి*
*బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్*
ప్రశ్న ఆయుధం, ఆగస్టు 13, కామారెడ్డి :
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ర్ట శాఖ పిలుపు మేరకు నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద స్వచ్చత కార్యక్రమం చేపట్టి ఆ మహనీయునికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం నేటి స్వాతంత్ర భారతం అని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుని వారి త్యాగాలు తెలుసుకోలనీ అలా అయితేనే ప్రజల్లో జాతీయ భావం పెరుగుతుందని అన్నారు. అందుకే నరేంద్ర మోది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.