ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
కొత్తగూడెం నియోజకవర్గం
చుంచుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకిరెడ్డి వెంకన్న అత్తయ్య కట్ట అచ్చమ్మ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన కోనేరు సత్యనారాయణ (చిన్ని).చుంచుపల్లి మండలం పెనగడప గ్రామానికి చెందిన కట్ట అచ్చమ్మ రోడ్డు ఆక్సిడెంట్ లో మరణించారు వారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సహకార సంఘం అధ్యక్షులు మండే హనుమంతరావు, మాజీ సర్పంచ్ మాలోత్ లక్ష్మణ్ ,ముగితే కరుణాకర్,మాజీ ఉప సర్పంచ్ కట్ట సంతోష్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు, ఆకిరెడ్డి శ్రీను,అల్లి వినయ్,కట్ట సాంబశివరావు,అల్లి నాగయ్య, మన్నె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.