నూతన అధ్యక్షున్ని సన్మానం చేసిన హైదర్ పటేల్
గజ్వేల్ ఆగస్టు 13 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ తంజు ముల్ మజీద్ కమిటీ చైర్మన్ గా సయ్యద్ మతిన్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో అతన్ని మంగళవారం సంగాపూర్ మదర్సా పాఠశాల చైర్మన్ ఎం. ఎస్. కే. హైదర్ పటేల్ శాలువా, పూలమాలతో సన్మానం చేసి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదర్ పటేల్ మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మతిన్ పేద మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.