ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ సిద్ధమా??

మున్సిపల్ అభివృద్ధిపై ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ సిద్ధమా??

ప్రశ్న ఆయుధం 22జులై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య,

అవినీతి ఆరోపణలపై పాలకవర్గమే విచారణ జరిపించి చిత్తశుద్ది నిరూపించుకోవాలి..కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోఉంటుంది…ప్రజాపక్షంలో కూడా ఉంటుంది…కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జే.బీ.శౌరి
అవినీతి కౌన్సిలర్ల బండారంత్వరలో బయటపెడతాంబీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
మున్సిపాలిటీపరిరక్షణకోసంఅవసరమైతే జైలుకు సిద్ధంజలాల్ ,సాదిక్ పాషా,కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు పాలకపక్షం ముందుకు రావాలని అఖిలపక్షం నాయకులు సవాలు విసిరారు…సోమవారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదని నాలుగున్నర ఏళ్ల అవినీతిపై సమగ్ర విచారణకు స్థానిక ఎమ్మెల్యే పూనుకోవాలనికోరారు.మున్సిపాలిటీలో పలు రకాల టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరుమెదపడంలేదనినిలదీశారు.ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో అణిచివేయాలనుకోవడం వారి అవివేకమని,ప్రశ్నించే పార్టీ ప్రజల వైపు ఉండాలి తప్ప పాలకపక్షం వైపు ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు.పట్టణంలోని 5వ వార్డులో సింగరేణి సంస్థ స్థలాన్ని తప్పుడు దృవ పత్రాలతో ఇంటి నెంబర్ ఎవరు కేటాయించుకున్నారో ప్రజలందరికీ తెలుసనీ,దొంగే దొంగా దొంగ అన్న చందాన మాట్లాడడం విడ్డూరంగాఉందనిదెప్పిపొడిచారు..పాతకొత్తగూడెంలో పేదలకు ఇచ్చిన ఖాళీ స్థలాల పక్కన 2కోట్ల విలువైన స్థలాన్నికబ్జాకుగురైనాస్పదించలేదని,రామవరం ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు అమ్ముకుంటున్నది ఎవరో విచారణ జరిపితేలోగుట్టుబయటకు వస్తుందనీవిమర్శించారు..మున్సిపల్ పరిధిలో ఉన్న 16,18 వార్డులో స్మశానాల స్థలాన్ని సైతం కబ్జా చేసి అక్రమ పద్దతిలో ఇంటి నెంబర్లు చేపించుకున్న ఘనులు ఎవరని ప్రశ్నించారు?? ఇంకా నిర్మాణాలు కూడా పూర్తి కానీ డబుల్ బెడ్ రూం కేటాయింపులోచేతివాటంప్రదర్శించిన ప్రజా ప్రతినిధులు,ఖాళీ స్థలాల పంపిణీలో అవకతవకలు,దళిత బంధు పథకం బినామీల ద్వారా పొందిన లబ్ధిపై ప్రమాణం చేయాలనీ డిమాండ్ చేశారు.జీ.ఓ.నెంబర్ 76 ద్వారా పట్టాల పంపిణీ కోసం వచ్చిన దరఖాస్తులు అందులో కౌన్సిలర్ లు చేసిన అవినీతి నిగ్గు తేల్చేందుకు సిద్దమా అని సూటిగా ప్రశ్నించారు..నాలుగున్నర ఏండ్లుగా రామవరం ప్రజలకు పోజిషన్ సర్టిఫికెట్లు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని అక్కడస్థానికంగా ఉన్న చైర్ పర్సన్ వైఫల్యం కాదా అని పేర్కొన్నారు….36 మంది కౌన్సిలర్లలో 16 మంది కౌన్సిలర్లు నిన్నటి ప్రెస్ మీట్ కు ఎందుకు సమావేశానికి రాలేదని దీన్ని బట్టి కౌన్సిల్ లో ఉన్న లుకలుకలు బయటకు తెలుస్తున్నాయని వివరించారు.మున్సిపాలిటీపై ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం సరైనా పద్ధతి కాదని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతీ పౌరుడు హక్కుగా స్పష్టం చేశారు.ఇటువంటి ఉడత ఊపులకు భయపడేది లేదని,ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని తేల్చి చెప్పారు.వెంటనే మున్సిపల్ అవకతవకలపై ఆర్.డి.ఓ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని తద్వారా పాలక పక్షం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు…లేదంటే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు..
ఈమీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జే.బీ.శౌరి,బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్,ప్రముఖ న్యాయవాది సాదిక్ పాషా,టిఆర్ఎస్ జిల్లా నాయకులు,మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్,వీణ,దళిత సంఘాల నాయకులు మోదుగు జోగారావు,బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పామర్తి అంకినీడు ప్రసాద్,కాంగ్రెస్ యువజన నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now