భార్యను చంపి బావిలో పడేసిన భర్త

*భార్యను చంపి బావిలో పడేసిన భర్త*

బి.కొత్తకోట మండలంలో మహిళ హత్యకు గురైన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు. బయప్పగారిపల్లి పంచాయతీ, పప్పిరెడ్డిగారిపల్లికి చెందిన పివి శేఖర్రెడ్డి భార్య కవిత(33) అంగళ్ళులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తోంది. భార్యకు ఓ వ్యక్తి మెసేజ్ పెట్టడం చుసిన భర్త భార్యను తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది అయితే ఆమెలో మార్పు రాకపోవడంతో రాత్రి గొడవపడి కొట్టి చంపి స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో పడేసినట్లు సమాచారం. మృతదేహాన్ని సోమవారం వెలికితీయించిన పోలీసులు మృతురాలి భర్త పీవీ శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment