*నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్ పేదల సంక్షేమానికి నిధుల కోత*
*సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్*
*జమ్మికుంట ఫిబ్రవరి 3 ప్రశ్న ఆయుధం*
పేదల సంక్షేమానికి నిధుల కోత విధించి ప్రజలకు నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్ తయారు చేశారని అని దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ 50,65,345 కోట్ల బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రతిపాదించగా అది పూర్తిగా కార్పొరేట్లకు అనుకూల బడ్జెట్ అని సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా లేదని ప్రజానుకుల బడ్జెట్గా సవరించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శీలం అశోక్ ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశ బడ్జెట్లో 25.2% వడ్డీ చెల్లించడానికి కేటాయించడం చూస్తుంటే దేశం అప్పుల కుప్పగా మారిపోయిందనీ ప్రతి వ్యక్తిపై 1,37,000 అప్పు చూపెట్టారంటే దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చునని ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేయడమంటే భారత సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు. పేదలకు మొండి చేయి చూపి సంపన్నులకు మేలు చేసే బడ్జెట్ ప్రతిపాదించారని పేర్కొన్నారు ఉత్పాదక రంగాలకు తగిన నిధులు కేటాయించలేదని ముఖ్యంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేవలం 2.5 శాతం మాత్రమే కేటాయించారని గత బడ్జెట్ కంటే పదివేల కోట్లు తగ్గించారని, ఎరువుల సబ్సిడీ 17 వేల కోట్లు కోత పెట్టారన్నారు. వలసలు ఆత్మహత్యలు నిరోధించే బడ్జెట్ గా లేదన్నారు. రాష్ట్రానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కు కూడా నిధుల కేటాయింపు లేవన్నారు ఉపాధి హామీ నిధులకు కోత పెట్టారని వంద రోజుల పని కల్పించాలని చట్టం చెబుతున్న గ్రామీణ పేదలను మరింత బలహీనపరిచే విధంగా ఉపాధి హామీకి నిధులు తగ్గించారని వైద్య రంగానికి బడ్జెట్లో 5 నుండి 10 శాతం నిధులు కేవలం కేటాయించాల్సింది పోయి కేవలం 1.8 శాతం కేటాయించారని విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయించాలని దళితులకు 10 శాతం కేటాయించాల్సి ఉండగా కేవలం ఐదు శాతం గిరిజనులకు 7 శాతం కేటాయించాల్సిన పోయి కేవలం 2 శాతం కేటాయింపులు చేయడం విడ్డూరమన్నారు బాలల సంక్షేమంపై కూడా బడ్జెట్లో కోత పెట్టారని భీమా రంగంలో 100% ఎఫ్ డి ఐ పెట్టుబడును ఆహ్వానిస్తున్నారంటే భీమారంగాన్ని మొత్తం కుదేలు చేసే చర్యలో భాగమే అని సంక్షేమరంగాన్ని విస్మరించి, పెన్షనర్లకు కూడా నిరాసేపరిచిన బడ్జెట్ గా ఉందన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ దేశంలో మరింత ఆర్థిక అసమానతలు పెంచే విధంగా ఉందన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నిధులు రాబట్టడంలో బండి సంజయ్ పూర్తిగా వైఫల్యం చెందాడన్నారు. జిల్లా ప్రయోజనాలు కాపాడడంలో కేంద్రమంత్రి విఫలమైనడన్నారు. కొత్తపల్లి మనోహరాబాద్ కరీంనగర్ కాజీపేట రైల్వే లైన్ల నిధుల కేటాయింపు స్పష్టత లేదన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి ప్రకటన ఊసే లేదన్నారు. త్రిబుల్ ఐటీ, ఐ ఐఎం గురించి ప్రకటనలేదన్నారు. ఏ ఒక్క కేంద్రీయ విశ్వవిద్యాలయంను కేటాయించలేదన్నారు. నవోదయ సైనిక్ స్కూల్ పాఠశాలల ఊసే లేదన్నారు. కరీంనగర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ గురించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. గొప్పలు, గప్పాలు మాట్లాడే కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిధులు కేటాయించే విధంగా ఒత్తిడి తేవాలని లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.