*భూ కబ్జాదారుల నుండి తమ భూమిని కాపాడాలంటూ బాధిత కుటుంబీకుల రిలే నిరాహార దీక్ష*
*మద్దతు తెలిపిన దళిత సంఘాల నాయకుడు అంబాల రాజు సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ*
జమ్మికుంట ఫిబ్రవరి 3 ప్రశ్న ఆయుధం
తమకు చెందిన సొంత పట్టా భూమిని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి కబ్జా చేయాలని చూస్తుంటే అతనికి స్థానిక పోలీస్ రెవెన్యూ అధికారులు మద్దతు పలుకుతున్నారంటూ
బాధితురాలు కాటిపల్లి లక్ష్మి కుటుంబ సభ్యులు సదరు స్థలంలో సోమవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తాము 2004 సంవత్సరంలో జమ్మికుంట మున్సిపల్ పరిధి ధర్మారం శివారులోని సర్వే నంబర్ 465/b/4 లో ఆరు గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. గత తొమ్మిది నెలల క్రితం వరకు తమ ఆధీనంలోనే ఉన్న భూమిని ఏనుగు జైపాల్ రెడ్డి అనే రిటైర్డ్ పోలీస్ అధికారి స్థానిక రెవెన్యూ పోలీసుల సహకారంతో తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని తమకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్, సిపికి అనేకసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని తమకు జరిగిన అన్యాయంపై గత ఐదు రోజుల క్రితము మీడియా ముఖంగా బహిర్గత పరుచుకున్న తర్వాత సంబంధిత భూ కబ్జాదారుడు అయిన ఏనుగు జయపాల్ రెడ్డి తమకు సంబంధించిన భూమి లో ఆదివారం రాత్రి మొరాన్ని తరలించి అక్రమ కట్టడం నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సదరు కబ్జాదారుడికి స్థానికంగా ఉన్న చోటామోటా నాయకులు సహకరిస్తున్నారని బాధితుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అయిన విషయాన్ని ఉన్నత అధికారులను కలిసి ఫిర్యాదు చేసిన పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం బాధిత కుటుంబానికి కోర్టు ద్వారా పూర్తి ఆధారాలు రెవెన్యూ పరంగా పూర్తి అనుమతులు ఉన్న తర్వాత కూడా ఇంత విచ్చలవిడిగా భూ ఖబ్జాదారులు రెచ్చిపోతున్నారంటే వీరిని కాపాడుతున్న అధికారులు ఎవరో దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని భూకబ్జా ఉదాంతంపై స్థానిక మంత్రి, ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు హాజరైన దళిత నాయకులు అంబాల రాజు మాట్లాడుతూ జమ్మికుంటలో కిందిస్థాయి పోలీస్ అధికారులను పై స్థాయి పోలీస్ అధికారులు ప్రోత్సహించబట్టే భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని భూ కబ్జాపై పూర్తిస్థాయి నిజ నిజాలను నిగ్గు తేల్చాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల బాధిత కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి ని పాదయాత్ర ద్వారా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని వారు పేర్కొన్నారు