కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో కేంద్ర బడ్జెట్

*కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో కేంద్ర బడ్జెట్*

*యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్*

*కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం*

*జమ్మికుంట ఫిబ్రవరి 3 ప్రశ్న ఆయుధం*

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఇది పూర్తిగా ఆర్ఎస్ఎస్ కన్నుసైగెలలో నడుస్తున్న బడ్జెట్ అని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ అన్నారు జమ్మికుంట పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసన వ్యక్తం చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు

యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కు మొండి చేయి చూపించారని బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా 8 మంది ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు రూపాయి కూడా తేకపోవడం సిగ్గు చేటని ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో రూపొందిన కేంద్ర బడ్జెట్ ప్రధాని మోడీ సమక్షంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివి వినిపించారని ఇదీ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ తెలుగు కవి అయినా గురజాడ అప్పారావు కవిత్వం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని బడ్జెట్ మొదలు పెట్టి ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపుతో ముగించారని ధ్వజమెత్తారు దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అని గొప్ప కవిత్వాన్ని మాటల్లో చెప్పి బీజేపీ ప్రభుత్వం చేతల్లో మాత్రం దేశమంటే ఎన్నికలున్న రాష్ట్రాలు, దేశమంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్న చందంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఇది పూర్తిగా తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు కేంద్రం బడ్జెట్ పేద‌రికాన్ని కాదు..పేద‌ల్ని ముంచే బ‌డ్జెట్‌ ఇది ముమ్మాటికీ అర్‌.ఎస్‌.ఎస్ డైరెక్ష‌న్‌లో న‌రేంద్ర‌మోడీ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ అంబానీ, అదానీ, కార్పొరేట్ల కోస‌మే అన్న‌ట్టుగా ఉందని నాగ‌పూర్‌లో ఉన్న‌టువంటి ఆర్‌.ఎస్‌.ఎస్ డైరెక్ష‌న్ చేస్తే నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో చ‌దివి వినిపించారని తెలంగాణపై అత్యంత నిర్లక్ష్యంగా ఉన్న కేంద్ర బడ్జెట్ పై ఇక్కడి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రమే మీ అభివృద్ధి అజెండా అయితే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని బడ్జెట్ పై ప్రధానిని కేంద్ర ఆర్థిక మంత్రిని పునరాలోచింప చేయాలని తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను వెంటనే కేటాయించాలని యువజన కాంగ్రెస్ గా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించి, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కి అవకాశం కల్పిస్తే కనీసం కరీంనగర్ జిల్లాకు ఒక్క రూపాయి, ఒక్క నూతన ప్రాజెక్ట్ తేలేని అసమర్థుడు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం కరీంనగర్ ప్రజల దురదృష్టం అని శ్రీకాంత్ అన్నారు.

ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరీంనగర్ కు ఎయిమ్స్ తరహా వైద్య కళాశాల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ జిల్లాలో నవోదయా విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, కరీంనగర్ రైల్వే ప్రాజెక్టును వేగవంతం చేయాలి, ఎక్స్ ప్రెస్ హైవేలు అభివృద్ధి చేయాలి నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలీ తదితర అంశాలపై దృష్టి సారించి నిధులు కేటాయించేలా తెలంగాణ కేంద్ర మంత్రులు బాధ్యత వహించాలని కోరారు.బడ్జెట్ పై కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల పునరాలోచించకపోతే యువజన కాంగ్రెస్ పక్షాన పోరాటాలు తీవ్రతరం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ కొమురయ్య, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేభూషి అజయ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్, శ్రీకర్, ఆకాష్, అరుణ్, సందీప్, రణదీర్, సంతోష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment