సంపన్న మాలల కుట్రలను తిప్పి కొట్టడానికి ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయండి

*సంపన్న మాలల కుట్రలను తిప్పి కొట్టడానికి ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయండి*

*జిల్లా కళామండలి అధ్యక్షుడు అంబాల ప్రభాకర్*

*డప్పు కళా మండలి సమక్షంలోలక్ష డప్పులు వేల గొంతుల

వాల్ పోస్టర్ విడుదల*

*కరీంనగర్ ఫిబ్రవరి 3 ప్రశ్న ఆయుధం*

ఈనెల 7న హైదరాబాద్ లోని సంపన్న మాలల కుట్రలను తిప్పి కొట్టడానికి ట్యాంక్ బండ్ పై ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ తలపెడుతున్న లక్ష డప్పులు వేల గొంతుల మహా కళా ప్రదర్శన సభ విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కళామండలి అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ అన్నారు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో డప్పు కళామండలి ఆధ్వర్యంలో లక్ష డబ్బులు వేల గొంతుకలు మహా కళా ప్రదర్శన వాల్పోస్టర్ను విడుదల చేశారు కరీంనగర్ జిల్లా కళామండలి అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే సుప్రీంకోర్టు ఏడుగురి జడ్జిలతో కూడిన ధర్మాసనం వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అనీ తీర్పు ఇవ్వడం ద్వారా 58 మాదిగ ఉప కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వారికి దక్కుతుందని తద్వారా వారికి విద్య ఉద్యోగ ఉపాది రాజకీయాల్లో అభివృద్ది జరుగు- -తుందని తెలిపారు దాన్ని అడ్డుకోవడానికి కొంత మంది సంపన్నమాలలు కుట్రలు పన్నుతున్న ఎస్సీ వర్గీకరణ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు వాళ్ల కుట్రలను తిప్పి కొట్టడానికి ఫిబ్రవరి 7న హైదారాబాద్ లో జరిగే

లక్ష డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శనకు కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో తరలివెళ్లి అట్టి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇవ్వడంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని నిండు అసెంబ్లీ సాక్షిగా తెలిపి ఇప్పుడు జాప్యం చేయడం బాదకరమని ఫిబ్రవరి 7 లోపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని ప్రకటించి లక్ష డప్పులు వేల గొంతుల లగ్గం డప్పు లు కొడుతూ విజయోత్సవమ్ లో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో కళా మండలి జిల్లా నాయకులు అంబాల శ్రీరామ్ గసిగంటి కుమార్ జీడి మోహన్ అంబాల మధునయ్య, మల్లేష్ గడికంటి కుమార్ (సింగర్) మహిళా కళా మండలి జిల్లా అధ్యక్షురాలు నక్క జ్యోతి, ఉపాధ్యక్షులు డప్పు రాధ, శైలజ, భాగ్య లక్ష్మి, ప్రధాన కార్యదర్శి భవానీ, ముఖ్య సలహా దారులు సోదిమెళ్ళ వాణి, రజిత ఎమ్ ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి దండు అంజయ్యమాదిగ జిల్లా నాయకురాలు దండు వరలక్ష్మి మాదిగ, స్వరూప, నక్క లక్ష్మణ్ మాదిగ, కొమ్ముల రాజమల్లు మాదిగ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment