అంత్యక్రియలకు ఆర్ధికసాయం
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 08: కూకట్పల్లి ప్రతినిధి
124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీలో నివసించే బౌరి నథన్ సింగ్(95) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులను అదేశించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. షౌకత్ అలీ మున్నా, రాజు గౌడ్, లకన్ సింగ్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.