ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం తొగుట మండలం వేములగట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 2004-2005 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు, దాదాపు 20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకొని, కష్ట సుఖాలను పంచుకున్నారు, చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులకు సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, దాదాపు రెండు దశాబ్దాల క్రితం మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని చాలా రోజుల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ఇకనుండి ప్రతి సంవత్సరం తప్పకుండా కలుసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగిందని ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now