ఐటిఐ ల పరిస్థితి అధ్వానం.

 

IMG 20240814 WA0035

రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు సహా గురుకులాలు సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.విద్యాలయాల్లో వసతులు క ల్పించాలని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ సహా రాష్ట్రంలో ని ఐటీఐల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని, సరిపడా టాయిలెట్స్‌ లేవని, అవసరమైన సిబ్బంది లేరని, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆయన ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. కంప్యూటర్లు ఇతర ఉపకరణాలు పనిచేయడం లేదని, దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌ చేయలేకపోతున్నారని తెలిపారు.

 

గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాముకాటులతో విద్యార్థి మృతి, డెంగ్యూతో విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయని ఆందోళన చెందారు. అత్యధి క ప్రాంగణాలు దోమలు, ఈగలతో ము రికి కూపాలుగా మారాయని, స్నానాల గదులకు డోర్లు కూడా లేని దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, పెడుతున్నది కూడా నాణ్యంగా లేదని, విధిలేక కారం మెతుకులతో కడుపునింపుకొంటున్నారని ఉదహరించారు.

 

సమస్యలు ఇలా ఉంటే విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి పెడతారని, గురుకులాలకు తమ పిల్లాలను తల్లిదండ్రులు ఎలా పంపుతారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హ యాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దిగజారుతుండటం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిషరించాలని డిమాండ్‌ చేశారు.

కోలుకుంటున్న

 

గురుకుల విద్యార్థిని కార్తీక

హైదరాబాద్‌, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి గాయాలపాలైన విద్యార్థిని కోలుకుంటున్నదని ప్రభుత్వం తెలిపింది. ములుగులోని తెలంగాణ సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కార్తీక 9న సూల్‌ మూడో అంతస్థు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని నడుము భాగంలో గాయాలయ్యాయి. కార్తీకను వరంగల్‌ ఎంజీఎంకు, అకడి నుంచి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థినికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిమ్స్‌ న్యూరో సర్జన్‌ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ తిరుమల్‌ బృందం మంగళవారం కార్తీకకు ఆపరేషన్‌ నిర్వహించగా, ఐసీయూలో కోలుకుంటున్నది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్‌ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now